
గొర్రెల మేతగా ఉల్లి పంట..
ఉండవెల్లి శివారులో గొర్రెలు మేస్తున్న ఉల్లి పంట
వరుణుడి రూపంలో రైతును కష్టాలు వెంటాడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చేతికొచ్చిన పంట ఎన్నో చోట్ల నీటిపాలైంది. ఉండవెల్లిలోని జాతీయ రహదారి సమీపంలో రైతు రాజు తన 4 ఎకరాల్లో ఉల్లి పంట వేశాడు. రూ.లక్షలు పెట్టుబడి పెట్టాడు. వానాకాలం ప్రారంభంలో విస్తారంగా వర్షాలు కురవడంతో దిగుబడి బాగా వస్తుందని, చేసిన అప్పులు తీరతాయని ఆశపడ్డాడు. కానీ, పంట చేతికి వచ్చే సమయంలో కురిసిన భారీ వర్షాలతో ఉల్లి పంట మొత్తం భూమిలోనే మురిగిపోయింది. దాదాపు రూ.4 లక్షల వరకు నష్టం వాటిళ్లడంతో దిక్కుతోచని పడ్డాడు. చేసేది లేక శుక్రవారం 4 ఎకరాల్లోని ఉల్లి పంటను ఇలా గొర్రెలకు మేతగా వదిలాడు. – ఉండవెల్లి