
శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు
గట్టు: సంఘ విద్రోహులు, శాంతిభద్రతలకు భంగం కల్గించే వారిపై కఠినంగా వ్యవహరించాలని గద్వాల డీఎస్పీ మొగులయ్య సిబ్బందికి సూచించారు. మండలంలోని గొర్లఖాన్‌దొడ్డి గ్రామంలో గతంలో నమోదు చేసిన ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కేసుకు సంబందించి ఆదివారం గొర్లఖాన్‌దొడ్డి గ్రామంలో ఆయన విచారణ చేపట్టారు. ఫిర్యాదుదారులతోపాటు చుట్టు పక్కల వారి నుంచి కేసుకు సంబందించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గట్టు పోలీస్ స్టేషన్‌కు చేరుకొని పలు కేసులకు సంబందించిన వివరాలపై ఎస్‌ఐ మల్లేష్‌తో ఆరా తీశారు. గ్రామాల్లో గస్తీని పెంచాలని, ప్రజలతో మంచి సంబంధాలను కల్గి ఉండాలని సిబ్బందికి సూచించారు. డీఎస్పీ వెంట ఎస్‌ఐ మల్లేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.