
బంతి సోయగం..!
మల్దకల్‌లో సాగు చేసిన బంతిపూల తోట
మల్దకల్ సమీపంలో బంతి పూల సోయగాలు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. రోడ్డుకు ఇరువైపులా పూల అందాలు ఆకర్శిస్తున్నాయి. దీపావళి, కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని బంతిపూలకు ఏటా డిమాండ్ ఉంటుంది. ఇదే అదునుగా రైతులు సైతం ఈ సీజన్‌లో బంతిపూల సాగు చేపడతారు. మల్దకల్ పెట్రోల్ బంకు సమీపంలో రైతు లక్ష్మన్న తన రెండెకరాల వ్యవసాయ పొలంలో బంతిపూలను సాగు చేయగా.. పసుపు కాంతులీనుతున్న
పూల మొక్కలు అటుగా వెళ్లే ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. ఈ దృశ్యాలను ఆదివారం
‘సాక్షి’ క్లిక్ మనిపించింది. – మల్దకల్