
ధర్మరక్షణకు కంకణ బద్ధులు కావాలి
మల్దకల్: దేశం, ధర్మం కోసం కంకణ బద్దులై పనిచేస్తూ దేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టేలా ప్రతి ఒక్కరూ తమవంతుగా కృషి చేయాలనే భావనను అందరిలో కలిగించాలని ఆర్‌ఎస్‌ఎస్ వక్త, విభాగ్ శారీరక ప్రముఖ్ భోగరాజు రాము అన్నారు. మల్దకల్‌లో ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలను ఆదివారం కార్యకర్తలు ఘనంగా జరుపుకొన్నారు. ఈమేరకు పదా సంచలన్ కార్యక్రమం, మార్చ్ నిర్వహించారు. భోగరాజు రాము మాట్లాడుతూ.. శతాబ్ది పంచ పరివర్తన విషయాలైన సామాజిక సామరస్యత, ప్రమోదం, పర్యావరణ స్వదేశ స్వాభిమానం, పౌరవిధుల ఆధారంగా సేవకులు సంఘ కార్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈమేరకు ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా సంయోజక్ జగదీశ్వర్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలుగోవిందు, మల్దకల్, రెడ్డప్ప, తిరుపతిరెడ్డి, తిమ్మన్న, దామ నాగరాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.