
అందరి ప్రోత్సాహంతో..
ఫిజిక్స్ విభాగంలో వాటర్‌సాలబుల్ రీఏజెంట్స్ పై పరిశోధన పూర్తి చేశాం. దానికి పేటెంట్ కూడా వచ్చింది. పరిశోధన పూర్తి చేయడానికి మా గైడ్ చంద్రకిరణ్‌తో పాటు అధికారులు అందరు ఎంతో సహకరించారు. పరిశోధన పూర్తి అయిన వెంటనే కాన్వకేషన్ నిర్వహించి డాక్టరేట్లు అందించడం చాలా సంతోషంగా ఉంది. – స్వాతి, పీహెచ్‌డీ గ్రహీత
సంతోషంగా ఉంది
పండ్ల తొక్కలు డీగ్రేషన్ చేయడం, పొల్యూషన్ ఉండకుండా ఉండే విధంగా, ఫ్రూట్‌జ్యూస్ కు సంబందించి క్లాసిఫికేషన్ పై పరిశోధన చేశాం. అందుకోసం గైడ్ టీచర్ మధుసూదన్‌రెడ్డి ఇతర అధికారులు ఎంతో సహకరించారు. అందుకు ప్రతి ఫలంగా కాన్వకేషన్‌లో డాక్టరేట్ అందుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. భవిష్యత్తు పరిశోధనలు సమాజానికి ఉపయోగపడే విధంగా కృషి చేస్తాం.
– ఏ.చేతన, పీహెచ్‌డీ గ్రహీత
పరిశోధనలకు
పేటెంట్ వచ్చింది
ప్రస్తుతం కాన్వకేషన్‌లో ఇద్దరు మా స్కాలర్స్ డాక్టరేట్ తీసుకుంటున్నారు. సమాజ హితం కోసం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి వచ్చే అంశాలపై పరిశోధనలు చేశాం. అందుకోసం పేటెంట్లు సైతం వచ్చాయి. భవిష్యత్ ప్రయోగాలు కూడా ప్రజలకు ఉపయోగ పడే విధంగా నిర్వహిస్తాం. – ఎన్.చంద్రకిరణ్,
అధ్యాపకుడు, ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్
సమాజహితం కోసమే..
పీయూలో ఇటీవల వివిధ డిపార్ట్‌మెంట్ల నుంచి ఎక్కువ సంఖ్యలో రీసెర్చి స్కాలర్స్ రావడం గొప్ప విషయం. ఇద్దరు స్కాలర్స్ మా ఆధ్వర్యంలో రీసెర్చి పూర్తి చేశారు. వారి పరిశోధనలు పూర్తిగా సమాజం, ప్రజల అవసరాలను తీర్చే విధంగా జరిగాయి. వారికి కాన్వకేషన్‌లో డాక్టరేట్‌లను ప్రదానం చేయడం గొప్ప విషయం.
– మధుసూదన్‌రెడ్డి, అధ్యాపకుడు మైక్రోబయాలజీ

అందరి ప్రోత్సాహంతో..

అందరి ప్రోత్సాహంతో..

అందరి ప్రోత్సాహంతో..