
స్నాతకోత్సవానికి పకడ్బందీగా ఏర్పాట్లు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: స్నాతకోత్సవానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని పీయూ వీసీ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం పీయూ అడ్మినిస్ట్రేషన్ భవనంలో వివిధ కమిటీల చైర్మన్‌లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్నాతకోత్సవ కార్యక్రమానికి వచ్చే అతిథులు, అధికారులు వాహనాలు నిలిపేందుకు ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేయాలని, భోజనాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమానికి హాజరయ్యే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మెడల్స్ స్పాన్సర్ కోసం అన్ని వసతులు కల్పించాలన్నారు. మీడియా వారికి అనుగుణంగా కార్యక్రమం నిర్వహించే హాల్‌తోపాటు పలు ప్రదేశాల్లో ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేసి వారికి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, హాస్పిటాలిటీ కమిటీ చైర్మన్ కృష్ణయ్య, మీడియా కమిటీ చైర్మన్ కుమారస్వామి, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ, అధ్యాపకులు మాలవి, అర్జున్‌కుమార్, భూమయ్య, శ్రీధర్‌రెడ్డి, జిమ్మీకార్టన్, రవికుమార్ పాల్గొన్నారు.