
అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
గద్వాలటౌన్: పట్టణాభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక నదిఆగ్రహారం సమీపంలో ఉన్న ఇండస్ట్రీయల్ ఏరియాలో చేపట్టే సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పట్టణాభివృద్ధే లక్ష్యంగా పనులు చేస్తున్నామని, ఆ దిశగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను అందిస్తున్నామన్నారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా గద్వాల పట్టణాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి ముందుకు వెళ్తున్నామన్నారు.