
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..
గద్వాలటౌన్: చిత్తూ.. చిత్తూల బొమ్మ.. శివుని ముద్దుల గుమ్మా.. బంగారు బొమ్మ.. దొరికెనమ్మ ఈ వాడలోన.. అంటూ మహిళలు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాన్ని ప్రతిబింబించే ఈ బతుకమ్మ పండగను జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలలో ముందస్తుగా నిర్వహించారు. బతుకమ్మ సంబరాలతో ఆయా విద్యా సంస్థలు మొత్తం సందడిగా మారాయి. మహిళా ఉపాధ్యాయులు సాంప్రదాయమైన దుస్తులు ధరించి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం మహిళలు బతుకమ్మలను తలపై పెట్టుకొని ముందుకు సాగారు. బతుకమ్మల ముందు పాటలు పాడుతూ బొడ్డెమ్మలు వేశారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేశారు. పలు విద్యా సంస్థలలో జరిగిన బతుకమ్మ వేడుకలలో ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి పాల్గొని బొడ్డెమ్మలు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బతుకమ్మ సంబరాలతో ఆడపిల్లల ఔన్నత్యాన్ని చాటి చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ధరూరులో బతుకమ్మలతో వెళ్తున్న విద్యార్థులు

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..