
‘డబుల్’ ఇళ్లలో పెండింగ్ పనులు పూర్తి చేయాలి
గద్వాల: జిల్లా శివారులోని డబుల్ బెడ్‌రూం ఇళ్లకు సంబంధించి పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. శనివారం ఆయన డబుల్ బెడ్‌రూం ఇళ్లతోపాటు, జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులను పరిశీలించారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లలో లబ్ధిదారులందరూ నివాసం ఉండే విధంగా అవసరమైన అన్ని చర్యలు వేగవంతంగా చేయాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న పెయింటింగ్, డ్రెనేజీ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషర్ జానకిరామ్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు ఉన్నారు.