
నాణ్యమైన విత్తనంతోనే అధిక దిగుబడులు
ఎర్రవల్లి: నాణ్యమైన విత్తనంతోనే రైతులు అధిక దిగుబడులు సాదించవచ్చునని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ కళ్యాణి అన్నారు. నాణ్యమైన విత్తనం – రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని తిమ్మాపురం, ఎర్రవల్లి, కొండపేట గ్రామాలను ఆమె సందర్శించి రైతులు సాగు చేసిన వరి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా విత్తనోత్పత్తికి రైతులు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను గురించి వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దీనివల్ల పంట పెట్టుబడి ఖర్చు తగ్గుతుందన్నారు. ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. దీని కోసం ప్రభుత్వంతో పాటుగా రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం కూడా ఎంతో కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రవికుమార్, ఏఈఓ నరేష్, రైతులు, తదితరులు ఉన్నారు.
వసతిగృహం తనిఖీ
ఉండవెల్లి: మండల కేంద్రంలోని ఎస్సీ వసతి గృహాన్ని ఎస్సీ సంక్షేమ శాఖ ఈడీ నుశీత గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని తనిఖీ చేయడంతోపాటు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని ఆరా తీశారు. వసతిగృహం అద్దె భవనంలో కొనసాగుతుండగా.. భవనంలో వెలుతురు కోసం లైటింగ్, అలాగే బాత్రూంలు మరమ్మతు చేయించాలని భవన యజమానికి సూచించారు. విద్యార్థుల హాజరు తదితర రికార్డులను పరిశీలించారు. హాస్టల్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. హాస్టల్ వార్టెన్ శేషన్న తదితరులు పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.5,592
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు గురువారం 212 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.5592, కనిష్టం రూ. 1802, సరాసరి రూ. 4522 ధరలు లభించాయి. అలాగే, 26 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ. 6059, కనిష్టం రూ. 5519, సరాసరి రూ. 5519 ధరలు పలికాయి.
హంస క్వింటాల్ రూ.1,744
దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం జరిగిన టెండర్లలో హంస ధాన్యం క్వింటాల్‌కు రూ.1,744 ఒకే ధర లభించింది. మార్కెట్‌కు దాదాపు వంద బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. ప్రస్తుతం మార్కెట్‌కు రైతులు కత్తెర పంట కింద సాగు చేసిన వరి దిగుబడులను అమ్మకానికి తెస్తున్నారు.

నాణ్యమైన విత్తనంతోనే అధిక దిగుబడులు