
పంటల సాగుపై స్పష్టత
పంటల సర్వే, నమోదు వల్ల ప్రభుత్వానికి పలు విషయాల్లో స్పష్టత రానుంది. ప్రధానంగా ఈసీజన్‌లో ఎన్ని ఎకరాల్లో పంటలు సాగు అయ్యాయి. ఏరకమైన పంటలు సాగు అయ్యాయి. ఇందులో ఆహార ధాన్యాల పంటలు, వాణిజ్య పంటలు సాగు అయ్యాయో తెలుస్తుంది. వీటి ఆధారంగా దిగుబడి అంచనా వేయడానికి వీలు కల్గుతుంది. ఈ దిగుబడుల ఆధారంగా ఆయా పంటలకు ఎంతమేర మద్దతు ధరలు ఇవ్వాలి, ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి తదితర విషయాలపై ప్రభుత్వానికి స్పష్టత వస్తుంది. దీంతో పాటు ఆయా పంటల దిగుబడుల ఆధారంగా ఆయా పంటలకు పట్టిపీడిస్తున్న చీడపీడలు, వైరస్‌లు ఏవేవీ ఆశిస్తున్నాయో కూడా తెలుస్తుంది. ఈవివరాల ఆధారంగా తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలను రైతులకు తెలియసేసే అవకాశం ఉంటుంది.