
ప్రణాళికతో చదివితే..
మొత్తం 180 మార్కులకు పరీక్ష నిర్వహించగా.. ప్రశ్నాపత్రం రెండు విభాగాలుగా ఉంటుంది. పార్ట్–ఏలో మానసిక సామర్థ్య పరీక్ష 90 మార్కులకు 90 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో రీజనింగ్ ఎబిలిటీ, సంఖ్యాశాస్త్రం, పదాల భిన్న పరీక్ష, నంబర్ అనాలజీ, ఆల్ఫాబెట్ అనాలజీ, కోడింగ్, డీ కోడింగ్, లాజికల్ ప్రశ్నలు, వెన్ చిత్రాలు, మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్‌కు సంబంధించిన అంశాలు ఉంటాయి. పార్ట్–బిలో ఏడు, 8వ తరగతికి సంబంధించి 90 ప్రశ్నలకు 90 మార్కులు కేటాయించారు. వాటిలో గణితం 20, సామాన్య శాస్త్రం 35, సాంఘిక శాస్త్రం 35 మార్కులు కేటాయిస్తారు. ప్రశ్నపత్రం తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. ప్రణాళికతో చదివి పరీక్షకు హాజరవుతే తప్పక విజయం సాధించేందుకు అవకాశం ఉంటుంది.