ఆధునిక హంగులతో..! | - | Sakshi
Sakshi News home page

ఆధునిక హంగులతో..!

Sep 7 2025 9:08 AM | Updated on Sep 7 2025 9:08 AM

ఆధుని

ఆధునిక హంగులతో..!

ప్రభుత్వానిదే తుది నిర్ణయం

రూ.98 కోట్లతో త్వరలో నూతన కోర్టుల నిర్మాణం

భిన్నవాదనలు..

గద్వాల క్రైం: జిల్లాలో నూతన కోర్టు భవనాల నిర్మాణానికి ముందడుగు పడింది. ఆధునిక హంగులతో 9.19 ఎకరాల్లో రూ.98 కోట్లతో 12 భవనాల నిర్మాణం చేపట్టనున్నారు. జిల్లా కోర్టు, ఫ్యామిలీ, పొక్సో కోర్టు నూతన భవన నిర్మాణా పనుల కోసం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 24 నెలలో పనులు పూర్తి చేసేందుకు టెండర్‌ ప్రక్రియ పూర్తి చేసింది. నిర్మాణ పనులు చేపట్టేందుకు ఆర్‌అండ్‌బీ అధికారులకు ప్రభుత్వం లేఖను ఇటీవల సీఫార్సు చేసింది. కోర్టు భవన సమూదాయ నిర్మాణ పనులు ఇంజినీర్ల పరవ్యేక్షణలో జరిగేలా ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కోర్టులు పాక్షికంగా దెబ్బతిన్న భవనాల్లో కొనసాగుతున్నాయి

స్థల కేటాయింపు

జిల్లాలోని పూడూరు గ్రామ శివారులోని పూటాన్‌పల్లి ప్రభుత్వ స్థలంలోని సర్వే నంబర్‌ 368లో 9.19 గుంటల భూమిని 2022లో రెవెన్యూ అధికారులు ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అయితే ఈ విషయంలో కొంత మంది సభ్యులు స్థల కేటాయింపునకు పునరాలోచన చేయాలని, జమ్మిచెడు శివారులోని సర్వే నంబర్‌ 691, 382లో కోర్టు భవనాల కోసం స్థల ఎంపిక చేయాల్సిందిగా సిఫార్సు చేశారు. అయితే ప్రభుత్వం వివిధ భూ సమస్యల కారణంచే జమ్మిచెడ్‌ శివారులోని స్థల కేటాయింపు విషయంలో పలు రకాల సమస్యలచేత నిరాకరించింది. ఎట్టకేలకు పూడూరు గ్రామ శివారు స్థలంలోనే చేపట్టేందుకు అమోదం తెలిపింది. టెండర్‌ ప్రక్రియ సైతం పూర్తి అయ్యింది. కేవీఎం సంస్థ రూ. 98 కోట్లకు పనులు దక్కించుకుంది.

12 భవనాల సముదాయం..

జిల్లా కోర్టు సమూదాయలను ఆధునిక హంగులతో నిర్మించనున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు విడుదలైన డిజైన్‌ సైతం ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతం గద్వాల సెగ్మెంట్‌లో జిల్లా కోర్టు, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు, పొక్సో కోర్టు, అదనపు జిల్లా సెషన్‌ కోర్టు, సీనియర్‌, జూనియర్‌ సివిల్‌ కోర్టు, అసిస్టెంట్‌ సెషన్‌ కోర్టు, అదనపు సెషన్‌ కోర్టులు కక్షిదారులకు అందుబాటులో ఉన్నాయి. అలంపూర్‌ సెగ్మెంట్‌లో మార్నింగ్‌ కోర్టు, జూనియర్‌ సివిల్‌ కోర్టులు కక్షిదారులకు అందుబాటులో ఉన్నాయి. నూతన కోర్టు సమూదాయ భవన నిర్మాణంలో 12 కోర్టు భవనాలు ఉండేలా ప్రభుత్వం రూప కల్పన చేసింది.

జిల్లాలో నూతన కోర్టు భవనాలతో కూడిన సమూదాయానికి గతంలో స్థల ఎంపిక ప్రక్రియను చేపట్టాం. రవాణా సౌకర్యం, కక్షిదారులు, ప్రజలకు అందుబాటులో ఉండేలా పలు స్థలాలను ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదికలు అందజేశాం. పూడూరు శివారులోని పూటాన్‌పల్లి గ్రామ సమీపంలోని 368లోని 9.19 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రభుత్వం సైతం ఇక్కడి స్థలానికి ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో కొందరు అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు, కక్షిదారులను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అధునిక హంగులతో త్వరలో నిర్మాణం చేపట్టనున్నాం. 24 నెలల్లో పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం.

– వి. లక్ష్మీనారాయణ, అడిషనల్‌ కలెక్టర్‌

12 భవనాల కోసం 9.19 ఎకరాలు కేటాయింపు

టెండర్‌ ప్రక్రియ పూర్తి

పూడూరు శివారులో స్థల ఎంపిక..?

జిల్లా కేంద్రంలో కొత్త కోర్టు భవనాలు నిర్మించాలని 2022లో రూ.100 కోట్లు మంజూరు చేస్తూ పూడూరు గ్రామ శివారులోని పూటాన్‌ పల్లి వద్ద 9.19 ఎకరాల ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. కక్షిదారులకు, ప్రజలకు దూరంగా ఉంటుందని కొంత మంది న్యాయవాదులు పూటాన్‌పల్లి స్థల విషయంలో విముఖత చాటారు. మరికొంత మంది న్యాయవాదులు మాత్రం హర్షం వ్యక్తం చేశారు. దీంతో స్థల ఎంపిక విషయపై న్యాయ వాదులు నిరసనలు, దీక్షలు చేపట్టారు. పీజెపీ క్యాంపులోని ప్రభుత్వ స్థలంలోనే జిల్లా కోర్టు సమూదాయాలు ఉండాల్సిందిగా పేర్కొన్నారు. ఒకవైపు హర్షం మరోవైపు వ్యతిరేఖతల మధ్య ప్రస్తుతం కొనసాగుతుంది.

ఆధునిక హంగులతో..! 1
1/2

ఆధునిక హంగులతో..!

ఆధునిక హంగులతో..! 2
2/2

ఆధునిక హంగులతో..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement