
వంతెన నిర్మాణానికి స్థల పరిశీలన
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువ ప్రాంతం నుంచి గద్వాలకు వెళ్లేందుకు వంతెన నిర్మాణానికిగాను స్థల పరిశీలన చేపడుతున్నట్లు నీటిపారుదలశాఖ చీఫ్ ఇంజినీర్ నాగేంద్రం తెలిపారు. శనివారం మండలంలోని జూరాల పుష్కరఘాట్, అమరచింత మండలం వద్ద వంతెన నిర్మాణాలకు అనువైన స్థలాలను పరిశీలించి మాట్లాడారు. రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు స్థల పరిశీలన జరిపామన్నారు. ఇటీవల జూరాలను సందర్శించిన మంత్రులు వంతెన నిర్మాణానికి కావాల్సిన రూ.120 కోట్లు మంజూరు చేసా ్తమని హామీ ఇచ్చారని.. అందులో భాగంగానే సందర్శించామన్నారు. జూరాల వద్ద వంతెన నిర్మాణంతో ఆత్మకూర్, అమరచింత మండలాల నుంచి జోగుళాంబ గద్వాల జిల్లాకు రవాణా సౌకర్యం మెరుగుపడనుందని అధికారులు పేర్కొన్నారు. ఆయన వెంట డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ సత్యనారాయణరెడ్డి, డీఈ నారాయణ, మార్కెట్ చైర్మన్ రహ్మతుల్లా, కాంగ్రెస్ నాయకులు పరమేష్, తులసీరాజ్, నల్గొండ శ్రీను, మహమూద్, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు.