
చెరుకు రైతులను ఆదుకోవాలి
అమరచింత: చెరుకు కోతలకు సరిపడా కార్మికులను ముందస్తుగా రప్పించి సకాలంలో పూర్తయ్యేలా చూడాలని కృష్ణవేణి ఘగర్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి శనివారం చెరుకు రైతులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కృష్ణవేణి చెరుకు రైతుసంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న మాట్లాడుతూ.. గత సీజన్‌లో ప్రకటించి అమలు చేస్తున్న రాయితీలను 2025–2026 సంవత్సరం కొనసాగించాలని, అధిక దిగుబడినిచ్చే వంగడాలను పరిచయం చేసి సాగుకు సహకరించాలన్నారు. చెరుకు రవాణాకు అనుకూలంగా ఉండేలా ట్రాక్టర్ ట్రాలీలు తయారు చేయించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రైతులకు ఇవ్వాల్సిన ష్యూరిటీ డబ్బులను వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని, ప్రతి రైతుకు ఇన్‌వాయిస్ ఇచ్చేందుకు యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కోరారు. ఫ్యాక్టరీ యాజమాన్యం సకాలంలో పంట డబ్బులు చెల్లించడం, రాయితీలు అందించడంతో మూడేళ్లుగా సాగు క్రమంగా పెరుగుతోందని.. ఇలానే కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో వాసారెడ్డి, రంగన్న, చంద్రసేనారెడ్డి, నారాయణ, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.5,980
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు శనివారం 464 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.5980, కనిష్టం రూ.33 56, సరాసరి రూ.3789 ధరలు లభించాయి.