
ఉన్నత లక్ష్యాలతో విద్యను అభ్యసించాలి
అలంపూర్: కళాశాల విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో విద్యను అభ్యసించాలని జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి హృదయరాజు అన్నారు. అలంపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన గురువారం తనిఖీ చేశారు. మొదట తరగతి గదులను పరిశీలించి అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి పురగతిపై ఆరా తీశారు. గణితం, ఇంగ్లీష్, తరగతులను బోధించడంతోపాటు వారి అనుమానాలను నివృత్తి చేశారు. క్రమం తప్పకుండా కళాశాలకు రావాలని, హాజరు శాతం తక్కువగా ఉంటే వచ్చే ఇబ్బందులను వివరించారు. ఒక ప్రణాళికతో పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ పద్మావతి. అద్యాపకులు సుధారాణి, అభిజ్ఞ, మౌనిక, రాజు, రాముడు, రామచంద్రయ్య, రఘువీర్ కుమార్, మల్లయ్య, ఆర్. రాముడు, తిరుపాల్ పాల్గొన్నారు.