మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

Jul 26 2025 8:29 AM | Updated on Jul 26 2025 8:48 AM

మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ధరూరు: మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇదిరా మహిళా శక్తి, రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యేతోపాటు కలెక్టర్‌ బీఎం సంతోష్‌ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకే ప్రాధాన్యతనిస్తోందని, కోటి మందిని కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వం లక్ష్యమన్నారు. ప్రమాద బీమా, రుణ బీమా కల్పనతో పాటు మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్‌టీసీ బస్సులు, పాఠశాలల నిర్వహణ, పెట్రోలు బంకులు, స్కూల్‌ యూనిఫాం తయారీ, వరి ధాన్యం కొనుగోలు నిర్వహణ వంటి అనేక అవకాశాలను కల్పిస్తుందని, ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని ఆర్థికంగా రాణించాలన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. మండలంలో మొత్తం 632 సంఘాల్లో 7వేల మంది మహిళలు ఉన్నారని, ఇంకా అనేక మంది సభ్యులుగా చేరాలని అన్నారు. మండలానికి మంజూరైన 800 ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. మండలానికి కొత్తగా 600లకు పైగా రేషన్‌ కార్డులు మంజూరి కావడం జరిగిందన్నారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులకు రూ.4.70 కోట్ల బ్యాంకు రుణాల చెక్కులను, రూ.49.41 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులను, కొత్త రేషన్‌ కార్డులను అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ హనుమంతు, బండారి భాస్కర్‌, కృష్ణారెడ్డి, సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.

గద్వాల మార్కెట్‌యార్డు అభివద్దికి కృషి

గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్‌ యార్డు అభివృద్ధికి చిత్తశుద్దితో కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం యార్డులో రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ, కాంపౌడ్‌వాల్‌ నిర్మాణాల పనులకు భూమిపూజ నిర్వహించి, పనులు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. యార్డు రాష్ట్రంలోనే ప్రసిద్దిగాంచిందని, ఏడాదిపొడవున పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరుగుతుంటాయన్నారు. ఇక్కడికి వచ్చే రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం దడవాయిలు, హమాలీలు, చాటకూలీలకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్‌ సుభాన్‌, జిల్లా మార్కెటింగ్‌ అధికారి పుష్ప. యార్డు కార్యదర్శి నర్సింహులు, యార్డు వైస్‌ చైర్మన్‌ శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement