
ఉద్యాన పంటల సాగుతో అధిక లాభాలు
ఇటిక్యాల: రైతులు ఉద్యాన పంటలను సాగు చేసి అధిక లాభాలు పొందవచ్చునని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి అక్బర్ అన్నారు. శుక్రవారం మండలంలోని మునగాలలో రైతు కుర్వ మల్లేష్ సాగుచేస్తున్న కూరగాయల పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు అధిక ఆదాయం ఇచ్చే కూరగాయలు, ఆయిల్‌పాం పంటలపై ప్రత్యేక దృష్టి సారించాలని, కూరగాయల సాగుకు ప్రభుత్వం వివిధ పధకాల నుంచి రాయితీని అందిస్తుందన్నారు. కలుపు సమస్య లేకుండా నీటిని ఆదా చేసుకుంటూ ప్లాస్టిక్ మల్చింగ్ పథకానికి 50 శాతం రాయితీ లభిస్తోందన్నారు. ఒక హెక్టార్‌కు రూ.20 వేల చొప్పున ఒక్కో రైతుకు రెండు హెక్టార్ల వరకు అందిస్తామని, అదే విధంగా తీగజాతి కూరగాయలు బీర, కాకర, సొరకాయ సాగు రైతులకు శాశ్వత పందిళ్ల నిర్మాణానికి అర ఎకరానికి రూ. 50 వేలు రాయితీని కల్పించబడుతుందని అన్నారు.కార్యక్రమంలో డివిజినల్ ఉద్వాన అధికారి రాజశేఖర్, సిబ్బంది ఇమ్రానా, మహేష్, రైతులు,తదితరులు పాల్గొన్నారు.
రైతులకు ఇబ్బందులు
కలిగిస్తే చర్యలు
ధరూరు: మండల కేంద్రంతో పాటు మండల పరిదిలోని ఆయా గ్రామాల్లోని ఫర్టిలైజ్ దుకాణాలను జిల్లా యవసాయ శాఖ అధికారి సక్రియా నాయక్ తనిఖీ చేవారు. శుక్రవారం ఆయన చింతరేవుల, మాల్‌దొడ్డి, గుడ్డెందొడ్డి, నెట్టెంపాడు తదితర గ్రామాల్లో ఏఓ శ్రీలతతో కలిసి తనిఖీలు చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. రైతుల ఆధార్‌కార్డులు తీసుకుని అవసరమైన మందులు ఇవ్వాలని, వారికి ఇబ్బందులు కలగకుండా యూరియాను అందించాలని, గట్టి మందులను అంటగట్టే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. నిర్ణీ త ధరలకే అమ్మకాలు జరపాలని, అధిక ధరలకు విక్రయించినట్లు రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని, ప్రతి కొనుగోలుకు సంబంధించి రషీదు అందించాలన్నారు. స్టాక్, ధరల పట్టికకు సంబంధించి బ్లాక్ బోర్డులను ఏర్పాటు చేయాలని, రైతులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో పర్టిలైజర్ డీలర్లు, ఏఈఓలు పాల్గొన్నారు.

ఉద్యాన పంటల సాగుతో అధిక లాభాలు