
మరణాల సంఖ్య తగ్గుతుంది
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సదుపాయాలున్నాయి. గర్భిణులపై ప్రత్యేక దృష్టి సారించాం. జిల్లా ఆసుపత్రి, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వారికి ప్రతి నెల నెలా ఆరోగ్య పరీక్షలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించి మనోధైర్యం నింపుతున్నాం. గర్భిణుల్లో కూడా చైతన్యం వచ్చింది. పౌష్టికహారం తీసుకుని వైద్యుల సలహాలు పాటిస్తున్నారు. తద్వారా మాత, శిశు మరణాల సంఖ్య తగ్గుతుంది. వైద్య ఆరోగ్యశాఖ చేపట్టిన చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయి.
– సిద్దప్ప, జిల్లా ఇన్‌చార్జ్ వైద్యాధికారి
●