
నల్లబ్యాడ్జీలతో రెవెన్యూ ఉద్యోగుల నిరసన
గద్వాలటౌన్: రెవెన్యూ అధికారుల విధులకు ఆటంకం కలిగించి, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అజిత్‌కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టరేట్, జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల ఎదుట రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గద్వాల జరిగిన నిరసనలో ఆయన మాట్లాడారు. పరుమాల శివారులో గల వ్యవసాయ పొలం సర్వే నిమిత్తం వెళ్లిన ఆర్‌ఐ రామకృష్ణ, సిబ్బందిని అడ్డుకుని దాడి చేశారన్నారు. ఇటిక్యాల హెడ్‌కానిస్టేబుల్ జ్యోతిప్రకాశ్, అతని కుమారుడు, భార్య రెవెన్యూ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తూ దాడి చేశారన్నారు. తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.