
ఆవాజ్ రాష్ట్ర సభలను జయప్రదం చేయాలి
గద్వాల: జిల్లా కేంద్రంలోని ఈ నెల 13, 14, నిర్వహించనున్న ఆవాజ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి జబ్బర్, అతికూర్ రెహమాన్ కోరారు. మంగళవారం గద్వాల పట్టణంలోని ఆవాజ్ రాష్ట్ర మహాసభల పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గద్వాల తేరు మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, జేఏసీ మధుసూదన్‌బాబు, మహమ్మద్, వెంకటస్వామి, శంకర్, ప్రభాకర్, నర్సింహులు, సుభాన్, తదితరులు ఉన్నారు.