
ఉద్యానం.. అధ్వానం
గద్వాల టౌన్: ప్రజలకు ఆహ్లాదం, ఆనందం, ఆరోగ్యాన్ని పంచాల్సిన ఉధ్యానాలు (పార్కులు) అధ్వానంగా మారుతున్నాయి. రూ.లక్షలు వ్యయం చేసి పార్కులు, ప్రకృతి వనాలను అభివృద్ధి చేసినప్పటికీ నిర్వహణ లేక నిరుపయోగంగా తయారవుతున్నాయి. జిల్లా కేంద్రంలో 34 వరకు పార్కులు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని చూస్తే అవి నిజంగా పార్కులేనా.. అనే సందేహం కలుగుతోంది. వీటిలో చాలా వరకు పిచ్చి మొక్కలు, ముళ్లపొదలతో నిండిపోయాయి. కొన్ని పార్కుల్లో ఆట వస్తువులు, సామగ్రి తుప్పు పట్టిపోయాయి.
క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలి
పార్కుల నిర్వహణ బాధ్యతను ఆయా కాలనీ సంఘాలకు అప్పగించాలి. అందుకు అవసరమైన నిధులను మున్సిపాలిటీ సమకూర్చడంతో పాటు నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. ఏటా నిర్మాణాల సంఖ్య పెరిగిపోతూ పట్టణం కాంక్రీట్ జంగల్‌గా మారుతోంది. అహ్లాదకరమైన వాతావరణం కోసం పార్కుల అభివృద్ధిపై మరింత శ్రద్ధ వహించాలి. – శ్రీధర్, గద్వాల
పార్కులను తీర్చిదిద్దుతాం..
పచ్చదనం, పార్కుల అభివృద్ధి కోసం గత బడ్జెట్‌లో ప్రతిపాదనలు సి ద్ధం చేశాం. వాటికి కలెక్టర్ సైతం ఆమోదం తెలిపా రు. పనులు టెండర్ దశ లో ఉన్నాయి. నిర్వహణ కొరవడిన పార్కుల లో వసతులను మెరుగుపరిచి అభివృద్ధి చేస్తాం. పట్టణ వాసులు సేద తీరేలా పార్కులను తీర్చిదిద్దుతాం. – దశరథ్, కమిషనర్, గద్వాల
‘జిల్లా కేంద్రంలోని 19వ వార్డులోని వీవర్స్ కాలనీ పార్కు నిర్వహణ కొరవడింది. గత కొంత కాలంగా దీని గురించి పట్టించుకోనే వారే కరువయ్యారు. పార్కు మొత్తం పిచ్చి మొక్కలతో నిండి ఆహ్లాదం కరువైంది. పిల్లల ఆట వస్తువుల చుట్టూ ముళ్ల పొదలు పేరుకుపోవడంతో అటువైపు వెళ్లడానికి చిన్నారులు భయపడుతున్నారు. రాత్రివేళల్లో కొంతమంది ఆకతాయిలు సేదతీరుతూ స్థానికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు.
పార్కులు, ప్రకృతి వనాలు నిర్వహణ లేక నిరుపయోగం
పిచ్చి మొక్కలు, ముళ్లపొదలతో నిండిన వైనం
తుప్పుపట్టిన ఆట వస్తువులు, సామగ్రి
కనిపించని ఆహ్లాదం

ఉద్యానం.. అధ్వానం

ఉద్యానం.. అధ్వానం

ఉద్యానం.. అధ్వానం