
ఆలయ లెక్కల్లో వాస్తవాలు నిగ్గు తేల్చాలి
రాజోళి: రాజోళిలోని చారిత్రాత్మక వైకుంఠ నారాయణ స్వామి ఆలయంలో పాత కమిటీ లెక్కలు చూపడం లేదని నూతన ఆలయ కమిటీ అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ రెడ్డి అన్నారు. శనివారం కమిటీ సభ్యులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 3 వ తేదీన నూతన కమిటీగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఆలయానికి సంబందించిన లెక్కలు ఇతర వివరాలు అడిగితే మాట దాటేస్తున్నారని అన్నారు. తప్పనిసరిగా లెక్కలు అడిగితే ఎనిమిది ఏళ్ల కిందట లెక్కలు ఎలా చూపుతామని అనడంపై పలు అనుమనాలు వ్యక్తమవుతున్నాయని, పదుల ఎకరాల్లో మాన్యాలు ఉన్న ఈ ఆలయానికి అభివృద్ధి చేయాల్సింది పోయి,లెక్కలు చూపకుండా దాచడంలో ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నించారు. వివరాలకు సంబందించి మళ్లీ మళ్లీ అడిగితే పాత కమిటీలోని కొందరు సభ్యులు నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని, గ్రామానికే కాకుండా రాష్ట్రానికే తలమానికమైన ఈ ఆలయ అభివృద్ధికి సహకరించాల్సింది పోయి నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని అన్నారు. ఆలయ ఈఓకు పలు మార్లు వివరాలు అడిగినా ఆయన కూడా మాట దాటేస్తున్నారని,ఆయన తీరుపై కూడా పలు అనుమనాలు ఉన్నాయని, వాస్తవాలను నిగ్గు తేల్చి ప్రజల ముందు ఉంచుతామని అన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు గోపి,భాస్కర్,మద్దిలేటి తదిదరులు పాల్గొన్నారు.