సంస్కృతి ఉట్టిపడేలా.. యువ ఉత్సవ్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

సంస్కృతి ఉట్టిపడేలా.. యువ ఉత్సవ్‌ పోటీలు

Mar 22 2025 1:20 AM | Updated on Mar 22 2025 1:15 AM

గద్వాలటౌన్‌: పల్లెజీవనం ప్రతిబింబించే నృత్యాలు.. సంస్కృతిలో ఆచార వ్యవహారాల ప్రదర్శనలు.. శాసీ్త్రయ జానపద నృత్యాలు ఇలా ఎన్నో భారతీయ కళలు ఉట్టిపడేలా జిల్లాస్థాయి యువ ఉత్సవ్‌ పోటీలు సాగాయి. భారత ప్రభుత్వం యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్రం వారు కళాశాల విద్యార్థులకు యువ ఉత్సవ్‌ – 2025 పోటీలు నిర్వహించారు. శుక్రవారం ఎంఏఎల్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పోటీలకు వేదికై ంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు. ఒకరికి మించి ఒకరు చక్కటి ప్రతిభ కనబర్చి న్యాయ నిర్ణేతల మెప్పు పొందారు. విద్యార్థులు సంస్కృతి సాంప్రదాయాలు, జీవనశైలి తదితర అంశాలతో కూడిన నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. సందేశాత్మకమైన అంశాలతో పలువురు విద్యార్థులు ప్రదర్శనలు ఇచ్చి మెప్పు పొందారు. ప్రతిభ చాటిన విద్యార్థులకు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ షేక్‌ కలందర్‌ బాషా, ప్రభుత్వ పీజీ సెంటర్‌ ప్రిన్సిపల్‌ వెంకటరెడ్డి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి వారు మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. విద్యార్థులలో సృజనాత్మక శక్తి వెలికితీయడానికి పోటీలు దోహదం చేస్తాయన్నారు. అనిల్‌గౌడ్‌, రాజేంద్రకుమార్‌ పాల్గొన్నారు.

సంస్కృతి ఉట్టిపడేలా.. యువ ఉత్సవ్‌ పోటీలు 1
1/1

సంస్కృతి ఉట్టిపడేలా.. యువ ఉత్సవ్‌ పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement