గద్వాల క్రైం: శాంతిభద్రతల పరిరక్షణలో సాయుధ దళ సిబ్బంది సేవలు ఎంతో కీలకమని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో సాయుధ దళ సిబ్బందితో సమావేశం నిర్వహించి మాట్లాడారు. విపత్కర సమయాల్లో సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రజలకు ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారన్నారు. విధుల నిర్వహణతో పాటు ఆరోగ్యం, కుటుంబ సభ్యుల సంక్షేమ్మంపై దృష్టి సారించాలన్నారు. ప్రతి ఒక్కరు శరీరకంగా, మాససికంగా ధృఢంగా ఉండాలన్నారు. సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్భయంగా అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం సిబ్బందితో పలు విషయాలపై ఆరా తీశారు. సమావేశంలో సాయుధ దళ డీఎస్పీ నరేందర్ రావు, సిబ్బంది తదితరులు ఉన్నారు.