అలంపూర్: ప్రతి ఒక్కరు మహిళలను గౌరవించాలని అలంపూర్ నియోజకవర్గ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్, స్థానిక న్యాయమూర్తి మిథున్ తేజ అన్నారు. అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్వర్యంలో అలంపూర్‌లోని జూనియర్ సివిల్ కోర్టులో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం నిర్వహించగా జడ్జి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం పలువురిని సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కుమార్, న్యాయవాదులు నారాయణరెడ్డి, శ్రీధర్ రెడ్డి , తిమ్మారెడ్డి , యాకోబు, వెంకటేష్, గజేందర్, గవ్వల శ్రీనివాసులు, కోర్టు సిబ్బంది ఉన్నారు.