
ఉత్సాహంగా తిరంగా ర్యాలీ
అలంపూర్: భారత సైనికులకు మద్దతుగా తిరంగా ర్యాలీ చేపట్టినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామంజనేయులు అన్నారు. అలంపూర్ పట్టణంలోని బీజేపీ మండల అధ్యక్షుడు ఈశ్వర్, పట్టణ అధ్యక్షుడు శరత్ బాబుల ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ ఆదివారం నిర్వహించారు. ఈ ర్యాలీకి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు సంఘీభావం, సైనికులకు మద్దతుగా తిరంగ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ఆపరేషన్ సిందూర్‌తో భారత్.. సత్తా ప్రపంచ దేశాలకు తెలిసిందన్నారు. దేశంలో పాకిస్తాన్ వంటి దేశాలు మతకల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నించాయని, అలాంటి దేశాలు దాడులకు పాల్పడితే భారత ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా ఉగ్రస్థావరాలను నాశనం చేసిందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు అక్కల రమసాయిబాబ, బీజేపీ నాయకులు స్వప్న, రాజగోపాల్, కేకే రెడ్డి, రాజశేఖర్ శర్మ, నరేశ్, మద్దిలేటి, శ్రీనివాసులు, నరసింహ్ములు, నాగేశ్వర్ రెడ్డి, నాగమద్ది లేటి, నరేష్ గౌడ్, పరుశురాముడు తదితరులు పాల్గొన్నారు.