జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఒక్కో యూనిట్ కింద ఐదు లక్షల రూపాయల్లో నాణ్యమైన ఇంటిని నిర్మించాలని హౌసింగ్ పీడీ వైద్యం భాస్కర్ అన్నారు. ఇందిరమ్మ గృహ నిర్మాణంపై గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నాక్ శిక్షణ కేంద్రంలో మేసీ్త్రలకు నిర్మాణ రంగంపై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్‌నగర్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్(నాక్)సెంటర్‌లో హౌసింగ్ కార్పొరేషన్ సహకారంతో ఆరు రోజుల శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొత్త టెక్నాలజీతో రూ.5 లక్షల బడ్జెట్‌లో ఇళ్లను నాణ్యతగా ఎలా నిర్మించాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నాక్ ఏడీ శివశంకర్, గృహ నిర్మాణ, డీఈ, ఏఈలు పాల్గొన్నారు.