గద్వాల: హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పరిపాలన జడ్జి నందికొండ నర్సింగ్‌రావు ఆదివారం గద్వాలకు వచ్చారు. ముందుగా పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తిని కలెక్టర్ బీఎం సంతోష్, ఎస్పీ శ్రీనివాస్‌రావు పుష్ప గుచ్ఛం ఇచ్చి సాదరంగా స్వాగతం పలికారు. వారితో కాసేపు ముచ్చటించారు. అదేవిధంగా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ మరియు సెషన్స్ జడ్జి కె.కుష, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి టి.లక్ష్మీ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పూజిత, అదనపు జూనియర్ సివిల్ జడ్జి డి.ఉదయ్‌నాయక్, జూనియర్ సివిల్ జడ్జీ మిథున్‌తేజలు న్యాయమూర్తికి ఆహ్వానం పలికి సన్మానించా రు. కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాస్‌రావు, అదనపు కలెక్ట ర్లు లక్ష్మీనారాయణ, ఆర్డీఓ శ్రీనివాస్‌రావు, బార్ అసో సియేషన్ సభ్యులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
ఆస్పత్రి నిర్మించండి
అయిజ: మండల కేంద్రంలో నిలిచిపోయిన 30 పడకల ఆస్పత్రి నిర్మాణాన్ని వెంటనే పూర్తిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం పీహెచ్‌సీ వద్ద బీజేపీ మండల అధ్యక్షుడు గోపాల కృష్ణ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రిని నిర్మాణాన్ని వెంటనే పూర్తిచేయాలని కోరారు. భగత్ రెడ్డి, లక్ష్మణ్ , రాజశేఖర్, వెంకటేష్ పాల్గొన్నారు.