గద్వాల: ప్లాట్ల క్రమబద్ధీకణకు సంబందించి మార్చి 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకునే వారికి ప్రభుత్వం 25 శాతం రిబేటు రాయితీ వర్తింపజేస్తుందని కలెక్టర్ సంతోష్ తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో సంబందిత అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. 2020 ఆగస్టు 26వ తేదీలోపు దాఖలైన ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులకు మాత్రమే ఇది వరకు క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించగా దరఖాస్తులు చేసుకునేందుకు వెసలుబాటు కల్పిస్తుందన్నారు. జిల్లాలోని మున్సిపాలిటీలలో సమాయక కేంద్రాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశించారు. సర్వే నంబర్లు, ప్లాట్ల అప్లికేషన్ సంఖ్య, రోడ్డు విస్తీర్ణం ఇనాం భూమి, ఇరిగేషన్ వంటి అంశాలను పక్కాగా పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఇన్‌చార్జ్ డీపీఓ నాగేంద్రం, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.