
‘రియల్’ మోసాలు
వివరాలు 8లో u
●
కొనే ముందు
జాగ్రత్తలు తప్పనిసరి
వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసే క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ నిబంధనలు పరిగణలోకి తీసుకోవాలి. సర్వే నంబర్ల ద్వారా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈసీలో నిర్దేశించిన వివరాలు వెలుగులోకి వస్తాయి. గ్రామ పంచాయతీ, మున్సిపల్, డీటీడీసీ అనుమతి తదితర అనుమతులు కలిగిన వెంచర్లు ఏవో తెలుసుకోవాలి. బాధితుల ఫిర్యాదులపై విచారణ చేపట్టి మోసం చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నాం. భూ సంబంధ కేసులు, సివిల్ సమస్యలను కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవాల్సిందిగా ప్రజలకు తెలియజేస్తున్నాం.
– శ్రీనివాసరావు, ఎస్పీ
గద్వాల క్రైం: సొంతింటి కలను అవకాశంగా మార్చుకొని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మోసాలకు తెరలేపుతున్నారు. ఒకే ప్లాట్‌ను ఒకరికి తెలియకుండా మరొకరికి రిజిస్ట్రేషన్ చేయడం.. ప్రభుత్వ స్థలాన్ని సైతం కప్పి పుచ్చి విక్రయించడం.. చివరికి ఇల్లు నిర్మించుకునే సమయంలో ఈ స్థలం మాదంటే.. మాది అంటూ ఒకరిపై ఒకరు గొడవకు దిగడం.. చివరికి పంచాయితీ పోలీసుల వద్దకు వెళ్లగా మోసపోయినట్లు తెలిసి పలువురు బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ఇటీవల పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయిస్తుండగా రియల్ మాయగాళ్ల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. గద్వాల, అలంపూర్ సెగ్మెంట్లలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా వెంచర్‌లు ఏర్పాటు చేసి సామాన్య ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారు. పోలీసుశాఖ నిర్వహించిన గ్రీవెన్స్‌లో ప్లాట్ల క్రయ విక్రయాలపై జరిగిన మోసాలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆరు నెలల వ్యవధిలో 60కు పైగా ప్లాట్ల మోసాలపై ఫిర్యాదులు వచ్చాయంటే తీవ్రత అర్థమవుతోంది.
ఒకే ప్లాట్‌ను పలువురికి విక్రయం
డబుల్ రిజిస్ట్రేషన్లతో బురిడీ కొట్టిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు
ఇల్లు నిర్మించుకునే సమయంలో అసలు విషయం వెలుగులోకి..
ఇబ్బందులు పడుతున్న ప్లాట్ల కొనుగోలుదారులు
పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు.. పలువురిపై కేసులు
జిల్లాలో ఆరు నెలల్లో 60కి పైగా ఫిర్యాదులు

‘రియల్’ మోసాలు
Comments
Please login to add a commentAdd a comment