ఎర్రవల్లిచౌరస్తా: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించాలని ఎన్నికల పరిశీలకురాలు భారతీ లక్పతినాయక్ భారతీ లక్పతి నాయక్ సూచించారు. సోమవారం ఇటిక్యాల మండలంలోని కొండేరు 7,8,9 పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి ఓటరు నమోదు, చనిపోయిన ఓటర్ల వివరాలను స్వయంగా పరిశీలించారు. ఫాం–6, 7, 8లలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ బీఎల్‌ఓలు ఫాం 6,7,8 ద్వారా ఉన్న దరఖాస్తులను రికార్డుల ద్వారా నమోదు చేసుకొని పూర్తి సమాచారాన్ని వారితో అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. పోలింగ్ బూత్‌ల నంబర్లు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే, వల్లూరులో 36,37 పోలింగ్ బూత్‌లలో ప్రత్యేక ఓటరు నమోదు క్యాంపులు, వచ్చిన దరఖాస్తులను స్వయంగా పరిశీలించారు. అనంతరం వల్లూరులో గ్రామస్తులతో ముచ్చటించి అర్హులైన వారందిరికి ఓట్లు ఉన్నాయా లేదా చూసుకున్నారా అని అడిగారు. ప్రజాప్రతినిధులతో సమన్వం చేసుకుంటూ బీఎల్‌ఓలు పనిచేయాలన్నారు. అలాగే, పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని ఎంఈఓ రాజుతో ఆరా తీశారు. కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రకళ, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, డిటీ నందిని, ఎస్‌ఓ అజిత్, ఆర్‌ఐలు ప్రశాంత్‌గౌడ్, సుదర్శన్‌రెడ్డి, జెఏ శోభ, ఆయా గ్రామాల బిఎల్వోలు, తదితరులు, ఉన్నారు.