ముగిసిన జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్
భూపాలపల్లి అర్బన్: రెండు రోజుల పాటు జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్‌స్పైర్ మేళా శనివారం ముగిసింది. ముగింపు సమావేశానికి జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు అవార్డులు అందించి మాట్లాడారు. విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగడానికి వైజ్ఞానిక ప్రదర్శన దోహదం చేస్తుందన్నారు. విద్యార్థుల ఉత్సాహం, సృజనాత్మకత, విజ్ఞాన పరంపరకు అద్దం పట్టిందన్నారు. విద్యార్థులు తమ ప్రాజెక్టులను ప్రదర్శించి, తమ శాసీ్త్రయ నైపుణ్యాలను ఆవిష్కరించారని అభినందించారు. సైన్స్ ఫెయిర్ రెండో రోజు వివిధ పాఠశాలల నుంచి 3వేల మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు సందర్శించినట్లు తెలిపారు. జిల్లాలో ప్రతిభ కనబర్చిన 27 ఎగ్జిబిట్లు రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి బర్ల స్వామి, డీసీఈబీ కార్యదర్శి చంద్రశేఖర్, ఏఎంఓ విజయ్‌పాల్‌రెడ్డి, సీఎంఓ రమేష్, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ట్రస్మా నాయకులు పాల్గొన్నారు.


