అంబేడ్కర్‌కు నివాళి
భూపాలపల్లి రూరల్: అంబేడ్కర్ వర్ధంతిని వివిధ పార్టీల నాయకులు, సంఘాల నాయకులు శనివారం జిల్లాకేంద్రంలో నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్‌తో కలిసి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. అంబేడ్కర్ బడుగు, బలహాన వర్గాలవారికి రక్షణ కల్పించిన మహనీయుడన్నారు. ఆయన రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు. మాజీ ఎమ్మెలే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు, ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌పీ, ధర్మసమాజ్ పార్టీ నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి నివాళ్లర్పించారు.


