మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

Dec 7 2025 8:44 AM | Updated on Dec 7 2025 8:44 AM

మహిళల

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

చిట్యాల: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా సంక్షేమ అధికారి మల్లేశ్వరి అన్నారు. అంతర్జాతీయ మహిళా హింస నిర్మూలన వారోత్సవాలలో భాగంగా శనివారం మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో ఐకేపీ వీఓ సభ్యులు, సీఏలు, సభ్యులతో కలిసి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేశ్వరి మాట్లాడుతూ మహిళలకు వరకట్న వేధింపులు, ఉద్యోగ రీత్యా కార్యాలయాలలో, ఇంటి వద్ద ఎన్నో రకాలుగా అనేక బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. వాటిని అరికట్టాలంటే చిన్నప్పటి నుంచే ఆడ పిల్లలకు ఆత్మ విశ్వాసం, ఽధైర్య సాహాసాలు, చదువుతో పాటు అన్ని రంగాలలో అవగాహన కలిగి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ జయప్రద, అనూష, మమత, ఐకేపీ ఏపీఎం రాజేందర్‌ పాల్గొన్నారు.

సైబర్‌ నేరాలపై

అవగాహన ఉండాలి

కాటారం: సైబర్‌ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండి తమ తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారికి వివరించి అప్రమత్తంగా ఉంచాలని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ అన్నారు. కాటారం మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఫ్రాడ్‌ కా ఫుల్‌ స్టాఫ్‌ కార్యక్రమంలో భాగంగా సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించారు. ఆన్‌లైన్‌ మోసాలకు గురికాకుండా ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అపరిచిత నంబర్లు, సందేశాలకు స్పందించవద్దని, ఫోన్‌లో వచ్చే ఓటీపీలు షేర్‌ చేయవద్దని పేర్కొన్నారు. సైబర్‌ నేరాల బారిన పడితే 1930 నంబర్‌కు వెంటనే సమాచారం అందించాలని తెలిపారు. అనంతరం సైబర్‌ నేరాల అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించి విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సీఐ నాగార్జునరావు, ఎస్సైలు రాజశేఖర్‌, మానస, ప్రిన్సిపాల్‌ నాగలక్ష్మి, ఉపాధ్యాయులు, పోలీస్‌ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

‘తీన్మార్‌ మల్లన్న

నిర్బంధం అక్రమం’

భూపాలపల్లి రూరల్‌: తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్‌ మల్లన్నను పోలీసులు అక్రమంగా హౌస్‌ అరెస్టు చేయడం అక్రమమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్‌ అన్నారు. మల్లన్న అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ... పట్టణంలోని అంబేడ్కర్‌ సెంటర్‌లో శనివారం టీఆర్‌పీ నాయకులు నిరసన చేపట్టారు. కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రవి పటేల్‌ మాట్లాడుతూ.. సాయి ఈశ్వరాచారి అంత్యక్రియలకు మల్లన్న వెళ్లకుండా అడ్డుకోవడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రణయ్‌ రాజ్‌, కరుణాకర్‌, సురేందర్‌, సునీల్‌, శ్రీలత, సంపత్‌, శ్రీను, నరసయ్య, ప్రణీత్‌, శ్రీకాంత్‌, శ్రీనివాస్‌, జినుకల శ్రీను, కృష్ణ, అశోక్‌ పాల్గొన్నారు.

గద్దెల ప్రాంగణం

పనుల పరిశీలన

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలోని సమ్మక్క– సారలమ్మ గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులను ములుగు ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ శనివారం పర్యవేక్షించారు. గద్దెల ప్రాంగణం సాలహారం నిర్మాణం చుట్టూ ఏర్పాటు చేస్తున్న రాతి పిల్లర్లను పరిశీలించారు. జాతర సమయంలో పోలీస్‌ అత్యవసర సేవలకు అనుగుణంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఎస్పీ సూచనలు చేశారు. జాతర సమయంలో భారీగా మేడారానికి తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గద్దెల ప్రాంగణంలో భక్తుల భద్రతా ఏర్పాట్లు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను, అత్యవసర సేవలు, సమన్వయం వంటి అంశాలపై సంబంధిత అధికారులతో ఎస్పీ చర్చించారు. తొలుత అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
1
1/3

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
2
2/3

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
3
3/3

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement