
అందుబాటులోకి కా పాస్ కిసాన్ యాప్..
పత్తి పంట అమ్ముకునే సమయంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం కా పాస్ కిసాన్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రైతులు స్మార్ట్‌ఫోన్‌లలో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని తమ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. రైతులు పత్తి విక్రయానికి ముందు ఈ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రైతులు తమ జిల్లాలో ఏ మిల్లులో అయిన పత్తి అమ్ముకోవడానికి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ అనంతరం సదరు మిల్లులో విక్రయాలకు అనుగుణంగా తేది, సమయాన్ని అధికారులు యాప్ ద్వారా రైతుకు తెలియజేస్తారు. రైతులు విక్రయాల కోసం పడిగాపులు కాయకుండా సమయానికి తీసుకెళ్లి పత్తి విక్రయించొచ్చు. ఇప్పటికే యాప్ విధానంపై వ్యవసాయశాఖ ఏఈఓలకు ఉన్నతాధికారులు అవగాహన కల్పించారు. వీరు రైతులకు వివరించనున్నారు.