
మెరుగైన వైద్యం అందించాలి
గణపురం: వైద్యులు ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని డీఎంహెచ్‌ఓ మధుసూదన్ అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ల్యాబ్ సేవలు ఎలా అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. మందులు అందుబాటులో ఉండే విధంగా చూడాలని వైద్యులకు సూచించారు. నిర్లక్ష్యం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట సిబ్బంది ఉన్నారు.
భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల తనిఖీల కోసం ఏర్పాటు చేస్తున్న తనిఖీ బృందాల ఏర్పాటును విరమించుకోవాలని డీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్ అశోక్, తిరుపతి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న ఎంఈఓ, డీఈఓ తదితర పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో పనిని మెరుగుపరచడానికి ఉపాధ్యాయులను తరగతి గదులకు పరిమితం చేయాలన్నారు.
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయం శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కాలసర్ప నివారణ పూజలకు మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. ముందుగా త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేశారు. కాలసర్ప నివారణ పూజలకు భక్తులకు అధికంగా హాజరయ్యారు. అనంతరం స్వామి వారి గర్భగుడిలో ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. దీంతో ఆలయ పరిసరాలు, గోదావరితీరాల్లో భక్తుల సందడి నెలకొంది.
కాటారం: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్(టీఆర్‌టీఎఫ్) జిల్లా అధ్యక్షుడు పెండెం మధుసూదన్ డిమాండ్ చేశారు. మండలంలోని పలు పాఠశాలల్లో మంగళవారం టీఆర్‌టీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ స్థానికత ఆధారంగా చేసుకొని 317 జీఓ బాధితులందరికీ న్యాయం జరిగేలా చూడాలన్నారు. కేజీబీవీ, టీజీఎంఎస్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘ సమావేశం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు పరంసింగ్, సమ్మయ్య, సతీశ్‌కుమార్, హట్కర్ రమేశ్‌నాయక్, మోహన్‌రావు, రేపాల వేణుగోపాల్ పాల్గొన్నారు.
భూపాలపల్లి రూరల్: నేటినుంచి నవంబర్ 14వ తేదీ వరకు జిల్లాలోని పశువులు, ఆవులు, గేదెలకు గాలికుంటు నివారణ టీకాలు వేయనున్నట్లు జిల్లా, పశు, సంవర్ధక శాఖ అధికారి డాక్టరు కుమారస్వామి అసోడా మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీకాలు వేసేందుకు 22 వైద్యబృందాలను ఏర్పాటు చేశామన్నారు. వ్యాధి సోకకముందే టీకాలు వేయించడం ద్వారా వ్యాధిని నివారించవచ్చన్నారు.
వెంకటాపురం(ఎం): రామప్పలో చేపట్టిన వరల్డ్ హెరిటేజ్ క్యాంపెయిన్ మంగళవారం 7వ రోజుకు చేరింది. ఉదయం యోగ గురువు రాంబాబు వలంటీర్లకు యోగాసనాలు నేర్పించి యోగతో కలిగే ఉపయోగాలను వివరించారు. అనంతరం రామప్ప హరిత హోటల్‌లో రాష్ట్ర జల వనరుల అభివృద్ది సంస్థ మాజీ చైర్మన్ వీరమల్ల ప్రకాశ్‌రావు కాకతీయుల గొలుసుకట్టు చెరువులు, వాటి వినియోగంపై వలంటీర్లకు వివరించారు.

మెరుగైన వైద్యం అందించాలి

మెరుగైన వైద్యం అందించాలి