
పత్తి పంట పోయింది..!
కాళేశ్వరం: ఎగువన కురిసిన వర్షాలతో మహదేవపూర్ మండలం అన్నారం టు చండ్రుపల్లి మధ్యలోని పంట పొలాలను ఈ ఏడాది గోదావరి బ్యాక్‌వాటర్ నాలుగుసార్లు ముంచింది. దీంతో పత్తి, వరి, మిర్చి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీనికితోడు అడవి పందులు, కోతులు తిరుగుతూ పంటను నాశనం చేస్తున్నాయి. చండ్రుపల్లికి చెందిన రైతు ఆకుదారి రాజయ్య పత్తి పంట వైరస్ సోకి పూర్తిగా ఎర్రబారిపోయింది. అడవి పందులు పంటను ధ్వంసంచేస్తున్నాయి. మంగళవారం పత్తి చేనులో మేకలు, గొర్రెలను తోలాడు. రూ.లక్షన్నర అప్పు అయిందని ఆవేదన వ్యక్తంచేశాడు.