
మద్యం సిండికేటు
ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో ఏ4 వైన్స్ 59
భూపాలపల్లి: మద్యం వ్యాపారులు ‘సిండికేటు’ అయ్యారు. గతంలో షాపులను దక్కించుకున్న వారు తిరిగి రంగంలో ఉండేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు గ్రూపుగా ఏర్పడి ఇతరులు దరఖాస్తులు చేసుకోకుండా తమవంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది.
రెండు జిల్లాల్లో 29 దరఖాస్తులే..
జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని 59 మద్యం షాపులకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. గత నెల 26వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుండగా శనివారం సాయంత్రం వరకు కేవలం 29 అప్లికేషన్లు మాత్రమే అందాయి. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో అత్యధికంగా భూపాలపల్లి సర్కిల్‌కు రాగా అత్యల్పంగా ఏటూరునాగారం, ములుగుకు వచ్చాయి.
భూపాలపల్లిలో సిండికేటుకు యత్నాలు..
భూపాలపల్లి జిల్లాలోని 12 మండలాల్లో 30 ఏ4 మద్యం షాపులకు ఎకై ్సజ్ అధికారులు టెండర్లు ఆహ్వానించారు. ఇక్కడ గతంలో షాపులను దక్కించుకున్న, మద్యం డాన్‌లుగా పేరొందిన వారు తిరిగి షాపులను దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఒక్కో వ్యాపారి 50 నుంచి 100కు పైగా దరఖాస్తులు సమర్పించగా, ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కోకుండా సులువుగా షాపులను దక్కించుకునేందుకు సిండికేటుగా ఏర్పడి అప్లికేషన్లు వేయనున్నట్లు సమాచారం. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రంగంలోకి రియల్టర్లు..
రాష్ట్రంలో ఇటీవలి కాలంలో రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడంతో రియల్టర్లంతా మద్యం వ్యాపారంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. భూపాలపల్లి, ములుగు జిల్లా కేంద్రంతో పాటు ఇతర జిల్లాలకు చెందిన రియల్టర్లు ఇక్కడి మద్యం షాపుల కోసం దరఖాస్తులు సమర్పించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి వారు సిండికేటు కావడంతో సమాలోచనలో ఉన్నట్లు సమాచారం.
ములుగులో పెరిగే అవకాశం..
ములుగు జిల్లాలో మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర, బొగత తదితర ప్రాంతాలు ప్రస్తుతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతున్నాయి. దీంతో ఇక్కడి మద్యం షాపులకు ఈసారి డిమాండ్ ఏర్పడనుంది. దీంతో ములుగు, ఏటూరునాగారం సర్కిల్ పరిధిలోని మద్యం షాపులకు అప్లికేషన్లు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఎకై ్సజ్ అధికారులు అంచనా వేస్తున్నారు.
రూ.300 అభిషేకం పూజలు
షాపుల కోసం పాత వ్యాపారుల ఎత్తుగడలు
సిండికేటుగా ఏర్పడి దక్కించుకునేందుకు యత్నాలు
శనివారం వరకు కేవలం
29 దరఖాస్తులు

మద్యం సిండికేటు

మద్యం సిండికేటు