
సారూ.. ఇంకెప్పుడిస్తారు?
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధి భాస్కర్‌గడ్డ సమీపంలో 2019లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి 2023లో పనులు పూర్తిచేసింది. అప్పటి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవం చేసి లబ్ధిదారులను ఎంపిక చేశారు. అనంతరం ఎన్నికల కోడ్ రావడంతో పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారుల జాబితాలో అవకతవకలు జరిగాయని రద్దు చేసింది. సర్వే చేసి లబ్ధిదారుల ఎంపిక చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులను ఆదేశించారు. అధికారులు సర్వేల పేరుతోనే రెండేళ్లుగా కాలయాపన చేస్తున్నారే తప్పా లబ్ధిదారుల ఎంపిక మాత్రం చేయడం లేదు. దీంతో గదుల్లోని విద్యుత్ వైర్లు, బోర్డులు, డోర్లు, పైపులు గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. కిటికీల అద్దాలు, వంట గదుల్లో గ్యాస్ బండలు పగులగొట్టారు. పలు చోట్ల గోడలు కూడా పగుళ్లు పడుతున్నాయి. ఆకతాయిలు మద్యం తాగి ఖాళీ సీసాలు పడేస్తున్నారు.
పంపిణీకి నోచుకోని భాస్కర్‌గడ్డ డబుల్ బెడ్‌రూం ఇళ్లు
● సర్వేల పేరుతో కాలయాపన ● ఆకతాయిలకు అడ్డాగా మారిన గృహాలు

సారూ.. ఇంకెప్పుడిస్తారు?

సారూ.. ఇంకెప్పుడిస్తారు?

సారూ.. ఇంకెప్పుడిస్తారు?

సారూ.. ఇంకెప్పుడిస్తారు?