
కంకరతేలి గుంతలమయంగా..
రేగొండ మండల పరిధిలోని బాగిర్థిపేట, కనిపర్తి, కొత్తపల్లిగోరి మండలంలోని వెంకటేశ్వర్లపల్లి, కోనరావుపేట, దామరంచపల్లి, గాంధీనగర్ బీటీ రోడ్డు అధ్వానంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు కంకర తేలి పెద్ద, పెద్ద గుంతలు తయారయ్యాయి. ఈ రహదారి గుండా ప్రయాణిస్తున్న వాహనదారులు గుంతల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు, పాలకులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. – రేగొండ
కంకర తేలిన వెంకటేశ్వర్లపల్లి, కోనరావుపేట రహదారి