
డీసీసీ పీఠం కోసం దరఖాస్తుల వెల్లువ
భూపాలపల్లి: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష(డీసీసీ) పదవి కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని 12 మండలాల నుంచి పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న వారు జిల్లా అధ్యక్ష పదవి కోసం దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఇప్పటివరకు మాజీ మావోయిస్టు గాదర్ల అశోక్ అలియాస్ ఐతు, రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్‌రెడ్డితో పాటు చల్లూరి మధు, ఇస్లావత్ దేవన్, మండల తిరుపతిగౌడ్, పిప్పాల రాజేందర్, మొకిరాల మధువంశీక్రిష్ణ, క్యాతరాజు సాంబమూర్తి, అప్పం కిషన్, దబ్బెట రమేష్, గద్దె సమ్మయ్య, గూట్ల తిరుపతి డీసీసీ పీఠం కోసం దరఖాస్తులు అందజేశారు. డీసీసీ అధ్యక్ష ఎన్నిక కోసం పార్టీ అధిష్టానం నియమించిన టీపీసీసీ పరిశీలకుడు జాన్సన్ అబ్రహం ఆదివారం సాయంత్రం భూపాలపల్లికి వచ్చారు. సోమవారం పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోనున్నారు. జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల అబీష్టం మేరకు మాజీ మావోయిస్టు గాదర్ల అశోక్‌కు డీసీసీ పదవి అప్పగించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.