
ముందస్తు బతుకమ్మ వేడుకలు
కాళేశ్వరం: మహదేవపూర్ మండల కేంద్రంలోని గ్రీన్‌వుడ్ పాఠశాలలో ముందస్తుగా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం పాఠశాల ఆవరణలో వివిధ రకాల పూలతో బతుకమ్మ ఆడారు. ఉత్సహంగా..ఉల్లాసంగా బతుకమ్మ పాటలు పాడారు. ఈ కార్యక్రమాన్ని ఉద్ధేశించి ముఖ్య అతిథి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాపు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అన్నారు. ఇది తెలంగాణ మహిళల సాంస్కృతిక జీవితంలో భాగం కావాలన్నారు. ప్రకృతిలోని వివిధ రకాల పూలను ఉపయోగించి బతుకమ్మను అలంకరించడం వల్ల ప్రకృతి ఆరాధన, పర్యావరణంపై ప్రేమ తెలుస్తాయన్నారు. ఈ పండుగ కుటుంబ బంధాలను, ముఖ్యంగా సీ్త్రల మధ్య స్నేహబంధాలను బలపరుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ చీర్ల శ్రీనివాస రెడ్డి, ప్రధానోపాధ్యాయులు చీర్ల శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్ ఆకుతోట రాజ్‌కుమార్, ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు, పీఏసీఎస్ చైర్మన్ చల్లా తిరుపతి రెడ్డి, ఎస్సై పవన్ కుమార్, మాజీ ఎంపీటీసీ ఆకుతోట సుధాకర్, అశోక్, నాగరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.