
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం
భూపాలపల్లి అర్బన్: సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి చేయడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు సైతం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు సింగరేణి సీఎండీ బలరాంనాయక్ తెలిపారు. ఏరియాలోని మిలీనియం క్వార్టర్స్ సమీప నర్సరీలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి సీఎండీ ఆదివారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతిన డం వలనే వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తున్నట్లు వివరించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని సూచించారు. మొక్కలు నాటడం వలన భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతాయన్నారు. తాను స్వయంగా సింగరేణి వ్యాప్తంగా 20,377 మొక్కలు నాటినట్లు తెలిపారు. ఆదివారం 377 మొక్కలను సీఎండీ నాటారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్ సూర్యనారాయణ, ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డి, పర్యావరణ జీఎం సైదులు, ఉద్యోగులు, నాయకులు పాల్గొన్నారు.
ఆలయాల అభివృద్ధికి కృషి
రేగొండ: ఆలయాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఆదివారం మండలంలోని కోటంచ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను సింగరేణి సీఎండీ బలరాంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోటంచ ఆలయంలో రూ.12 కోట్లతో ఆలయ పునరుద్ధరణ పనులు జరుగుతున్నట్లు తెలిపారు. పనులు త్వరగా పూర్తి చేయడంతో పాటు.. ఆలయ పున: ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం సింగరేణి సీఎస్‌ఆర్ నిధులు కావాలని ఎమ్మెల్యే కోరగా సీఎండీ సానుకులంగా స్పందించారు. అంతకుముందు బాలాలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యే క పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ భిక్షపతి, నాయకులు సంపత్ రావు, పున్నం రవి, వినోద్, క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి సీఎండీ బలరాంనాయక్
మొక్క నాటిన సీఎండీ, ఎమ్మెల్యే

పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం