
ప్రాక్టికల్స్‌తో విద్యార్థులకు ఉపయోగం
భూపాలపల్లి అర్బన్: ప్రాక్టికల్స్ బోధన ద్వారా విద్యార్థులకు సులభంగా పాఠాలు అర్థమవడంతో పాటు పలు ఉపయోగాలు ఉంటాయని ఇన్‌చార్జ్ డీఈఓ రాజేందర్ తెలిపారు. స్థానిక ఆశ్రమ పాఠశాలలో జిల్లా స్థాయి బోధనాభ్యాసన సామగ్రి కృత్యమేళ క్వాలిటీ కోఆర్డినేటర్ కాగిత లక్ష్మణ్ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన 107 ప్రదర్శనలను ఉపాధ్యాయులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడారు. అనంతరం రాష్ట్రస్థాయికి ఎంపికై న ఎనిమిది ప్రాజెక్టుల ఉపాధ్యాయులకు బహుమతులు అందజేశారు. తెలుగు విభాగంలో కవిత (రామారావుపల్లి), వి.స్వప్న (కృష్ణకాలనీ), ఆంగ్లంలో శ్రీమతి (ములకలపల్లి), రజిత (వెలిశాల), గణితంలో తౌటం స్వామి (జంగేడు), నాగరాణి (చింతలపల్లి), పరిసరాల విజ్ఞానంలో ఎం.శ్రావణి (ఖాసింపల్లి), రిబిక (జంగిడిపల్లి) 8 ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్లానింగ్ కోఆర్డినేటర్ దుప్పటి రాజగోపాల్, సీఎంఓ సామల రమేష్, ఏఎస్‌ఓ రామకృష్ణ, మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
డీఈఓ రాజేందర్