
ఎఫ్‌ఆర్‌ఎస్ తప్పనిసరి
మొగుళ్లపల్లి: పాఠశాలలోని ప్రతీ విద్యార్థి ఎఫ్‌ఆర్‌ఎస్ (ఫెషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్)ను మొబైల్ యాప్ ద్వారా అటెండెన్స్ నమోదు చేయాలని డీ ఈఓ ముద్దమల్ల రాజేందర్ సూచించారు. మంగళవారం మండలంలోని రంగాపురం, మొగుళ్లపల్లి, కొరికిశాల గ్రామాల్లోని కేజీబీవీ, ఆదర్శ పాఠశాల, ఎంఈఓ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలోని ఉపాధ్యాయుల, వి ద్యార్థుల రిజిస్టర్, ఎండీఎం రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు యూడైస్‌లో నమోదై ఉండాలన్నారు. రిజిస్టర్‌లో ఉన్న ప్రతీ విద్యార్థి ఎఫ్‌ఆర్‌ఎస్ మొబైల్ ఆప్ ద్వారా విధిగా అటెండెన్స్ నమోదు చేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించి, భోజన తయారీలో పలు జాగ్రత్తలు తీసుకుంటూ, నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని మధ్యాహ్న భోజన కార్మికులకు సూచించారు. ఆయన వెంట జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ దుప్పటి రాజగోపాల్, మండల విద్యాశాఖ అధికారి లింగాల కుమారస్వామి, డీ సీఈబీ అసిస్టెంట్ సెక్రటరీ కిషన్ రెడ్డి, ఉపాధ్యాయులు ఉన్నారు.
డీఈఓ రాజేందర్
పలు పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీ