
‘ప్రజాపాలన’ ముఖ్య అతిథిగా బెల్లయ్యనాయక్
భూపాలపల్లి: జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయ ఆవరణలో నేడు(బుధవారం) నిర్వహించనున్న ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్యనాయక్ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని కలెక్టర్ రాహుల్ శర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
భూపాలపల్లి అర్బన్: అంతర్జాతీయ నైపుణ్య పోటీలకు దరఖాస్తులను ఈ నెల 30వ తేదీ వరకు స్వీకరిస్తున్నట్లు స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ జుమ్లానాయక్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇండియాస్కిల్ కాంపిటిషన్ 2025 (నైపుణ్య పోటీ)లను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. 16 నుంచి 24 సంవత్సరాల లోపు అభ్యర్థులు 63 నైపుణ్య విభాగాల్లో ఏదైన ఒక విభాగంలో నైపుణ్యం కలిగి ఉన్నట్లయితే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. స్కిల్‌ఇండియాడిజిటల్.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. జిల్లా, రాష్ట్ర, రీజినల్, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
జిల్లా కోర్టులో ఉద్యోగాలకు..
జిల్లా కోర్టులో ఖాళీల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి రమేష్‌బాబు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీనియర్ సూపరింటెండెంట్ (హెడ్ క్లార్క్), సబార్డినేట్‌ల నియామకాలకు దరఖాస్తులను ఈ నెల 22వ తేదీలోపు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయమైన శ్రీరామాలయంలో గోకులాష్టమి సందర్భంగా సోమవారం రాత్రి విశేష పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భగవత అంతర్గత శ్రీకృష్ణ జనన ఘ ట్టం పారాయణం, భజన కార్యక్రమాలు చేశా రు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. మంగళవారం ఉదయం శ్రీరామాలయం నుంచి ఉత్సవమూర్తులను ఊరేగింపు సేవను నిర్వహించారు. వీధుల్లో భక్తులపై గో పాలకృష్ణ కాలువలు (పెరుగు చల్లడం) చేశా రు. ఉట్టి కొట్టుట కార్యక్రమాలు ఘనంగా ని ర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ ఎస్.మహేష్, సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్, అర్చకులు పనకంటి ఫణీంద్రశర్మ, ఆరుట్ల రామాచార్యులు, సిబ్బంది,భక్తులు పాల్గొన్నారు.

‘ప్రజాపాలన’ ముఖ్య అతిథిగా బెల్లయ్యనాయక్