
ఓజోన్ పొరను కాపాడాలి
కాళేశ్వరం: ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని టీబీఎస్‌ఎఫ్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు మడక మధు ఆధ్వర్యంలో మహాదేవపూర్ స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని హెచ్‌ఎంల సహకారంతో ఏడువందల మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. మంగళవారం మహదేవపూర్ మండలకేంద్రంలో ఓజోన్ పొర గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఓజోన్ పొర సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన వికిరణాన్ని 97% నుంచి 99% వరకు గ్రహించి, భూమిపై జీవరాశిని కాపాడటానికి ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఓజోన్ పొరకు హాని కలిగించే సీఎఫ్‌సీలు లేని రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్ల వంటి ఉత్పత్తులను ఉపయోగించాలని ప్రభాకర్ రెడ్డి, మధు అవగాహన కల్పించారు. పాఠశాల ఆవరణలో మహదేవపూర్ ఎఫ్‌డీఓ సందీప్‌రెడ్డి, హెచ్‌ఎం, విద్యార్థులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, పీఏసీఎస్ చైర్మన్ చల్ల తిరుపతిరెడ్డి, తహసీల్దార్ రామారావు, ఎంపీడీఓ రవీంద్రనాథ్, ఎంఈఓ ప్రకాష్‌బాబు, ఎస్సై–2 సాయిశశాంక్, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మహదేవపూర్‌లో 700 మంది
విద్యార్థులతో ర్యాలీ