
గంజాయి నిర్మూలనకు ప్రత్యేక బృందాలు
భూపాలపల్లి: జిల్లాలో గంజాయి నిర్మూలనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ కిరణ్ ఖరే మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల మాదకద్రవ్యాల వినియోగం, వ్యాపారం, సాగు విస్తరిస్తున్న పరిస్థితిని పరిగణలోకి తీసుకుని, వాటిని అరికట్టేందుకు సమగ్ర వ్యూహరచనతో చర్యలు ప్రారంభించామన్నారు. ఈ మేరకు జిల్లాలోని ప్రతి సర్కిల్ పరిధిలో ఒక్కో ప్రత్యేక బృందాన్ని, భూపాలపల్లి టౌన్‌లో రెండు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందాలు తమ పరిధిలో గంజాయి వినియోగం జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవడం, సాగు జరుగుతున్న పొలాలను వెలికితీయడం, సరఫరా మార్గాలను అడ్డుకోవడం జరుగుతుందన్నారు.
ఎస్పీ కిరణ్ ఖరే