
ఆదివారం శ్రీ 7 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
వివిధ భాషల్లో 5వేల పుస్తకాలు, వందలాది జర్నల్స్, పురాతన స్క్రిప్ట్‌లు.. ఒకేచోట కొలువై ఉన్న ప్రొఫెసర్ గజ్జెల రామేశ్వరం ఇంటర్నేషనల్ నేచురోపతి లైబ్రరీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఇక.. అనేక మంది విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడనుంది. అరుదైన విజ్ఞాన సంపద ఉన్న ఈ ప్రకృతి గ్రంథాలయంతో ఇటీవల కాకతీయ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకుంది. గత జూలైలో పుణే జాతీయ ప్రకృతి వైద్య సంస్థ కూడా పరస్పర ఒప్పందం చేసుకుంది. భారతీయ సంప్రదాయ విజ్ఞాన వ్యవస్థ అభివృద్ధి వ్యాప్తికి పరిశోధనలు, శిక్షణ వంటి విద్యా కార్యక్రమాల్లో పరస్పర ప్రయోజనాలు పొందనున్నారు. ఈ ప్రకృతి వైద్య గ్రంథాలయం ప్రత్యేకతలు, విద్యార్థులకు ఉపయోగం, తదితర అంశాలపై ఈ వారం ప్రత్యేక కథనం.
నేచురోపతి లైబ్రరీ రీసెర్చ్ సెంటర్‌తో కేయూ, పుణే సంస్థల ఎంఓయూ
కేయూతో ఎంఓయూతో
కలిగే ప్రయోజనాలు..
కాకతీయ యూనివర్సిటీ వారు ఈ నెల ఒకటో తేదీన ప్రకృతి వైద్య గ్రంథాలయంతో ఎంఓయూ చేసుకున్నారు.
● ప్రకృతి వైద్యజ్ఞానాన్ని సమయానికి పొందేలా ఈ లైబ్రరీ రీసెర్చ్ సెంటర్‌లోని పుస్తకాల క్యా టలాగ్, వర్గీకరణ చేపడతారు. ఇందుకు కేయూ లైబ్రరీ సైన్స్ విద్యార్థులను వినియోగిస్తారు.
● ఇరు సంస్థల వర్క్‌షాప్‌లు, సేవల మార్పిడి కోసం ఎలాంటి ఆర్థిక భారం ఉండబోదు. సదస్సులు, సమావేశాలను సంయుక్తంగా నిర్వహించేందుకు అవకాశం ఉంది.
● ఎంఎల్‌ఐఎస్సీ విద్యార్థులు, పీహెచ్‌డీ పరిశోధకులు తమ ప్రాజెక్ట్ వర్క్స్, ఇంటర్న్‌షిప్‌లకు అధ్యయనం చేసేందుకు ఈ ప్రకృతి వైద్య లైబ్రరీలోకి అనుమతి ఉంటుంది.
● ఆర్ట్స్ విద్యార్థులు ప్రకృతి వైద్య విజ్ఞాన సంపదను వినియోగించుకోవచ్చు. ఉదాహరణకు తెలుగు భాషలో ప్రకృతివైద్యంపై పద్యాలు, కవితల రూపంలో కూడా చికిత్స విధానాలున్నాయి.
● అమెరికా సిలికాన్ యూనివర్సిటీలో ఆయుర్వేద డిప్లొమా కోర్సు నడుస్తున్నది. తెలుగు, హిందీ భాషల్లో ప్రకృతి వైద్యానికి సంబంధించిన పుస్తకాలు, జర్నల్స్ ఉన్నాయి. ఆయా భాషల్లో ప్రకృతి వైద్యంపై పరిశోధన చేయాలనుకునేవారికి ఎంతో ఉపయోగపడనుంది.
● ఫార్మసీ విద్యార్థులకు ఫార్మాకాగ్నెన్స్ నేచురోపతికి సంబంధించిన ఆయుర్వేదం, యోగా, నేచురోపతి మీద ఒక పేపర్ ఉంది. ఆయా విద్యార్థుల సిలబస్‌కు అనుగుణంగా నూట్రిషన్స్, రోగ నిరోధకత పరిశోధనలకు ఉపయోపడే ప్రకృతి వైద్యం, విజ్ఞాన పుస్తకాలను ఉపయోగించుకోవచ్చు.
● ఇంటినే గ్రంథాలయంగా మార్చిన గజ్జెల రామేశ్వరం
● వివిధ భాషల్లో 5 వేల పుస్తకాలు, జర్నల్స్ అందుబాటులో..
● ప్రకృతి వైద్యపరిజ్ఞానం
పెంపొందించుకునే అవకాశం
కేయూ క్యాంపస్:
హనుమకొండ ప్రకాశ్‌రెడ్డిపేటలోని ఇంటర్నేషనల్ నేచురోపతి లైబ్రరీ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో దేశ, విదేశీ భాషా గ్రంథాలు ఉన్నాయి. ప్రకృతివైద్యానికి సంబంధించిన 50 పత్రికలు లభిస్తాయి. కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం విశ్రాంత ఆచార్యులు గజ్జెల రామేశ్వరం 2018 జూలై 24న తన ఇంటిలోనే ఈ లైబ్రరీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ప్రకృతి వైద్యంపై ఆసక్తి ఉన్నవారు ఈ లైబ్రరీలో ఉచితంగా ప్రవేశించి చదువుకునే అవకాశం కల్పించారు.
పుణే జాతీయ ప్రకృతివైద్య సంస్థతో..
పుణేలోని జాతీయ ప్రకృతివైద్య సంస్థ గత జూలై 1న ఈ ప్రకృతి వైద్య గ్రంథాలయ పరిశోధన కేంద్రంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ సత్యలక్ష్మి, రామేశ్వరం ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. పుణే జాతీయ ప్రకృతి వైద్యసంస్థలో ఆస్పత్రి ఉంటుంది. అక్కడి నేచురోపతి కోర్సుల విద్యార్థులకు క్లినికల్ రీసెర్చ్‌కు సంబంధించిన ప్రకృతి వైద్య విజ్ఞాన పుస్తకాలు, జర్నల్స్ ఇక్కడి లైబ్రరీ రీసెర్చ్‌సెంటర్‌లో ఉన్నాయి. ఆ విద్యార్థులు ఇక్కడికి వచ్చి వినియోగించుకుంటారు. ఇతర దేశాల శాస్త్రవేత్తలు, ప్రకృతి వైద్యులు తమ సంస్థను సందర్శించిన సమయంలో పరిశోధనల విజ్ఞాన పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉండడం వల్ల వారిని తరచూ ఇక్కడికి పంపే అవకాశాలున్నాయి. ఇది హెల్త్ ఎడ్యుకేషన్ టూరిజానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
యోగా, హిస్టరీ, లైఫ్ సైన్సెస్ వారికి ఉపయుక్తం
కేయూ దూరవిద్యలో యోగా డిప్లొమా కోర్సు నడుస్తోంది. ఈ విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు 300 వరకు ఉన్నాయి. ఫిజికల్ ఎడ్యుకేషన్‌లోనూ నేచురోపతిపై ఒక పేపర్ ఉంది. సైకాలజీ విద్యార్థులకు మానసిక వైద్య విద్యకు సంబంఽధించి ప్రకృతి వైద్యపరంగా విజ్ఞానసంపద ఉంది. భారత ప్రకృతివైద్య చరిత్ర, ప్రకృతి వైద్య ఉద్యమ వైతాళికులు ఎవరు అనే అనేక అంశాలు, చారిత్రక పరంగా ప్రకృతి వైద్యవిధానం ఎలా వచ్చిందనే దానిపై హిస్టరీ విద్యార్థులు, పరిశోధనలకు ఈలైబ్రరీ రీసెర్చ్‌సెంటర్‌లో అనేక దేశ, విదేశాల పుస్తకాలు, జర్నల్స్ అందుబాటులో ఉన్నాయి. లైఫ్‌సైన్సెస్ పీజీకోర్సుల విద్యార్థులకు ఉపయోగపడే జ్ఞాన సంపద అందుబాటులో ఉంది.
ప్రకృతి వైద్యవిజ్ఞానం ప్రజాబాహుళ్యంలోకి..
మూడున్నర దశాబ్దాలుగా సేకరించిన అరుదైన ప్రకృతి వైద్యవిద్య, సాహిత్య విజ్ఞాన సంపదను అందుబాటులో ఉంచా. కేయూ, పుణేలోని జాతీయ ప్రకృతివైద్య సంస్థతో మా లైబ్రరీ రీసెర్చ్ సెంటర్‌తో ఎంఓయూ కుదుర్చుకున్నాం. విజ్ఞాన సంపదను విద్యార్థులు, పరిశోధకులు ఉపయోగించుకోవాలి. – గజ్జెల రామేశ్వరం, ప్రకృతి
వైద్య లైబ్రరీ రీసెర్చ్ సెంటర్ వ్యవస్థాపకుడు
ఇంటర్న్‌షిప్‌నకు కూడా..
ఈ ఎంఓయూతో ఎంఎల్‌ఐఎస్సీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌నకు అవకాశం లభించింది. తొలుత ఒకటి రెండురోజుల్లోనే ఇద్దరు విద్యార్థులను ఆ లైబ్రరీ సెంటర్‌కు పంపనున్నాం. మా లైబ్రరీ సైన్స్ విభాగంనుంచి ఆ లైబ్రరీలో పుస్తకాల క్యాట్‌లాగ్, క్లాసిఫికేషన్‌కు విద్యార్థులు సహకారం అందిస్తారు. – డాక్టర్ రాధికారాణి, కేయూ లైబ్రరీ సైన్స్ విభాగం అఽధిపతి

ఆదివారం శ్రీ 7 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025

ఆదివారం శ్రీ 7 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025

ఆదివారం శ్రీ 7 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025

ఆదివారం శ్రీ 7 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025

ఆదివారం శ్రీ 7 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025

ఆదివారం శ్రీ 7 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025

ఆదివారం శ్రీ 7 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025

ఆదివారం శ్రీ 7 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025